అక్కినేని ఇంట పెళ్లి సందడి

అక్కినేని ఇంట పెళ్లి సందడి
x
Akkineni family ( file photo)
Highlights

అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం

అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థ వేడుకకి అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌, అమల, సుమంత్‌, సుప్రియ, నాగసుశీల, సుశాంత్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సమంత లేదు. ప్రస్తుతం సమంత ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ కారణం చేత సమంత హాజరు కాలేకపోయిందని తెలుస్తుంది. ఇక అక్కినేని నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించిన వెంకీమామ రేపు (శుక్రవారం) ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories