Akira Nandan: నెట్టింట్లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడి వీడియో

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

admin1
Updated on: 3 Aug 2021 5:54 PM IST
Akira Nandan Performing the Martial Arts
X

Akira Nandan: నెట్టింట్లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడి వీడియో

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే తాజాగా తన ప్రతిభతో అకిరా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ లో తన సత్తా చూపిస్తూ అకీరానందన్ ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. తాజాగా అకీరానందన్ కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా అకిరా కర్ర సాము అదరగొట్టాడు అని నెటిజన్లు అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరా ను కొనియాడుతున్నారు. అకీరా కర్రసాము వీడియో కి రేణూ దేశాయి పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ పాటను యాడ్ చేసి విడుదల చేయగా ఆ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జానీ 2 అంటూ అకీరా ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. మరోవైపు అకీరానందన్ టాలీవుడ్ లో హీరోగా ఎప్పుడూ అడుగు పెట్టనున్నాడు అని అడగగా రేణుదేశాయ్ మాత్రం కరోనా సమయంలో అకీరా రాక పై క్లారిటీ ఇవ్వడం కష్టమేనని కొట్టిపారేశారు. సినిమాల విషయంలో కాకపోయినా అకీరానందన్ సోషల్ మీడియాలో అయినా కనిపిస్తున్నందుకు అభిమానులు ఆనందిస్తున్నారు.


admin1

admin1

Next Story