Vakeel Saab: సెకాండాఫ్ లో స్పెషల్ ఎంట్రీ... ఎవరో తెలుసా?

Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ (ఫొటో: ది హన్స్ ఇండియా)

Highlights

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత తెరపైకి రావడంతో ఫ్యాన్స్ లో సంతోషం ఆకాశాన్ని అంటుతోంది.

అయితే, ఈ చిత్రం ద్వితీయార్ధంలో ఓ సస్సెన్ ఉంటుందని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రచారం చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఓ మెగా హీరో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఫిల్మ్ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ స్పెషల్ ఎంట్రీ పై టీం కూడా మౌనంగాను ఉంటోంది. రిలీజ్ వరకు అలానే ఉంచాలనుకున్నట్లు తెలుస్తోంది. తెరపై చూసే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవ్వాలనే ఇలా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ స్పెషల్ ఎంట్రీపై ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు.

తాజా సమాచారం ప్రకరాం, వకీల్ సాబ్ సెకాండాఫ్‌లో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కొన్ని సెకన్ల పాటు కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రత్యేక సన్నివేశంలో, తండ్రి-కొడుకులు తెరపై కనిపిస్తారని తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే, మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగేనని భావిస్తున్నారు సినీ ప్రముఖులు. దీనిపై కూడా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వకీల్ సాబ్ సినిమా విడుదలకు కొద్ది సమయం మాత్రమే ఉండడంతో... ఆ సస్పెన్ ఎంటో తెలిసిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories