"అకీరా కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు" అంటున్న అడివి శేష్

* తాజాగా సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్లు తెలిపారు

R Tripura Malini
Published on: 7 Dec 2022 12:12 PM IST
Akira Is Also Waiting For The Film Says Adivi Sesh
X

"అకీరా కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు" అంటున్న అడివి శేష్

Adavi Sesh: యువ హీరో అడివి శేష్ ని నటుడిగా పరిచయం చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. "పంజా" సినిమాలో ముఖ్య విలన్ పాత్రలో కనిపించిన అడివి శేష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నారు. ఆ సినిమా తర్వాత కూడా వీరిద్దరి స్నేహం కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ కూడా అడివి శేష్ కి చాలా మంచి స్నేహితులు.

తాజాగా సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్లు తెలిపారు శేష్. "సాహో" సినిమా తర్వాత సుజిత్ కి బాలీవుడ్ నుంచి కూడా రెండు మూడు ఆఫర్లు వచ్చాయని కానీ సుజిత్ వాటిని రిజెక్ట్ చేశాడని అన్నారు. "సాహో తర్వాత బాలీవుడ్ నుంచి కూడా తనకి కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ తెలుగులో ఒక సినిమా చేయడం కోసం తను వాటిని రిజెక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు తను సినిమా సైన్ చేయటం చాలా సంతోషంగా ఉంది.

మన అభిమాన నటుడితో పనిచేయటం చాలా గొప్ప విషయం. అకీరా కూడా ఈ సినిమా గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. తను కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు," అని అన్నారు అడివి శేష్. ఇక శేష్ మాత్రమే కాక ప్రభాస్, రామ్ చరణ్, మంచు మనోజ్, తదితరులు కూడా పవన్ కళ్యాణ్ మరియు సుజీత్ కాంబోలో సినిమా విషయంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా సినిమా మొదలవ్వకుండానే ఈ సినిమాపై భారీ బజ్ మాత్రం మొదలైందని చెప్పవచ్చు. మరి ఈ బజ్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story