Akhil's Agent Movie: మళ్లీ రీషూట్ మొదలు పెట్టిన అఖిల్ చిత్రబృందం

Akhil's Agent Movie: "ఏజెంట్" సినిమాకి రిపేర్లు మొదలు పెట్టిన చిత్ర బృందం

admin1
Updated on: 23 Jan 2022 1:15 PM IST
Akhils Agent Movie  Reshoot | Tollywood News
X

మళ్లీ రీషూట్ మొదలు పెట్టిన అఖిల్ చిత్రబృందం

Akhil's Agent Movie:: హీరోగా మారిన తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న అక్కినేని అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా తో ఎట్టకేలకు యొక్క మొట్టమొదటి కమర్షియల్ హిట్ ను అందుకున్నాడు. నిజానికి ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లు చూసి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ దసరా సెలవులు వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేయటం జరిగాయి. మరోవైపు దిల్ రాజు నిర్మించిన "షాదీముబారక్" కథ కూడా ఒకేలా ఉండడంతో చిత్ర దర్శక నిర్మాతలు కొన్ని మార్పులు చేశారు.

ఇక ఫైనల్ కాఫీ ఓకే అనిపించుకున్నాక మాత్రమే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మరోవైపు అఖిల్ తదుపరి సినిమా అయినా "ఏజెంట్" విషయంలో కూడా ఇలాంటి మార్పులు చేర్పులు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 25% పూర్తయింది. కానీ కొవిడ్ కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పటివరకు చేసిన రషెస్ చూసిన సురేందర్ రెడ్డి మరియు బృందం హీరో క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు ఉంటే బాగుంటుందని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కూడా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" లాగా హిట్ అవుతుందో లేదో చూడాలి.

admin1

admin1

Next Story