'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ క్యామియో

బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ క్యామియో
x
Highlights

ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు' సినిమా సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మన్మధుడు 2' సినిమాతో బిజీగా ఉన్న నాగార్జున త్వరలో...

ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు' సినిమా సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మన్మధుడు 2' సినిమాతో బిజీగా ఉన్న నాగార్జున త్వరలో 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా ప్రీక్వెల్ అయిన 'బంగార్రాజు' సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టానున్నారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ అఖిల్ కోసం ఈ సినిమాలో ఒక మంచి పాత్రను రూపొందించినట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే 'మనం' సినిమాలో అఖిల్ క్యామియో పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో తన మార్కెట్ బాగా పడిపోయింది. మరి 'బంగార్రాజు' సినిమాలో అఖిల్ పాత్ర ఎలా ఉండబోతుంది, అది అఖిల్ కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొంతకాలంగా దర్శక నిర్మాతలు వెతుకుతున్నారు. సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు 'మన్మధుడు 2' సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories