Akhil Akkineni: అఖిల్ బర్త్ డే స్పెషల్ గా .. ఐదో సినిమా ఫస్టులుక్!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని నటిస్తోన్నఐదో సినిమా ఫస్టులుక్ ను విడుదల చేశారు.

Kranthi
Published on: 6 April 2021 8:04 PM IST
Akhil Next Movie Frist Look Will be Released on His Birthday
X

Akhil Akkineni:(Photo Twitter)

Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్, అందగాడు, అమ్మాయిల మనసు దోచేశాడు, డాన్సులతో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా, వాటిలో మూడు సినిమాలు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పించిన లేకపోయాయి. మరి నాలుగో సినిమా బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రెడీ అవుతోంది. దీనిని జూన్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించేసింది.

ఇంతలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురెండర్2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. A'S లోడింగ్ అంటూ రీసెంటుగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతునట్లు హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ లుక్ డేట్ ని చిత్ర యూనిట్ వెల్లడించింది.ఈ నెల 8వ తేదీన అఖిల్ పుట్టిన రోజు ఆ సందర్భంగా ఆ రోజున ఉదయం 9:09 నిమిషాలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.

హీరోలను స్టైలీష్ గా ప్రెజెంట్ చేయడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. మరి అఖిల్ ను ఎలా చూపిస్తాడో ఆయన జోడిగా ఏ బ్యూటీని రంగంలోకి దింపుతాడో చూడాలి. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్‌ తన లుక్‌ని కూడా మార్చుకున్నారు. దీంట్లో ఆయన కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించనున్నారని సమాచారం.

Kranthi

Kranthi

Next Story