Most Eligible Bachelor: అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’

Samba Siva Rao
Published on: 3 Feb 2021 7:20 PM IST
Most Eligible Bachelor: అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

యుంగ్ హీరో అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్'. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ఏడాది నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం థియేటర్లను పూర్తి సామర్థ్యంతో నడపవచ్చని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లైంది.

తాజాగా అఖిల్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాయిదా వేశారు. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలు కట్టాడు. మూడు పరాజయాలు వెంటాడుతున్న అఖిల్‌ ఈసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తో ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందేనని గట్టిగా ఫిక్సయ్యాడు. ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడో లేదో చూద్దాం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story