Akhil Akkineni: నాగ చైతన్య అలాంటి వాడు అంటున్న అఖిల్..

Akhil Akkineni: ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో షాకింగ్ కామెంట్లు చేసిన అఖిల్

Jyothi
Updated on: 9 April 2023 9:30 PM IST
Akhil Made Shocking Comments in a Interview
X

Akhil Akkineni: నాగ చైతన్య అలాంటి వాడు అంటున్న అఖిల్..

Akhil Akkineni: యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా వరుసగా మూడు డిజాస్టర్లను అందుకున్నారు. ఈ మధ్యనే విడుదలైన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పరవాలేదు అనిపించారు. కానీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైనే పెట్టుకున్నారు. "ఏజెంట్" అనే టైటిల్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో అందరికీ షాక్ ఇవ్వనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. ఈ సినిమాతో అఖిల్ ఎలాగైనా హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన అన్నయ్య నాగ చైతన్య గురించి ఓపెన్ అప్ అయ్యారు. "చైతూ మా నాన్న లాంటి వాడు. నాకంటే చాలా ఎక్కువ సరదాగా ఉంటాడు. కానీ తను సైలెంట్ కిల్లర్.

తను జీవితంలో ప్రతిదీ నిశ్శబ్దంగా చేసేస్తాడు" అని నాగ చైతన్య గురించి అన్నారు అఖిల్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక స్పై పాత్రలో కనిపించబోతున్నారు. స్టార్ మలయాళం నటుడు మమ్ముట్టి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు సురేందర్ 2 సినిమా వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతాన్ని అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story