విజయ్ దేవరకొండ ని మించిన అఖిల్ ఫాలోయింగ్

Akhil Has More Followers on Twitter Than Vijay Devarakonda
x

విజయ్ దేవరకొండ ని మించిన అఖిల్ ఫాలోయింగ్

Highlights

*విజయ్ దేవరకొండ కంటే అఖిల్ గొప్ప అంటున్న అభిమానులు

Vijay Deverakonda-Akkineni Akhil: ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక హిందీ లో కూడా తన ప్రతిభ చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "లైగర్" సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ ఈ సినిమా గురించి రెండు మూడు చోట్ల మాట్లాడి సినిమాకి హైప్ తీసుకురావాలని ట్రై చేశారు. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న మొదటి సినిమా ఇది.

అయితే మరోవైపు యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కి మరియు అఖిల్ కి మధ్య పోలిక పెట్టలేం. ఎందుకంటే వారు ఇద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చిన విధానం, వారి కెరీర్ గ్రాఫ్, సక్సెస్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ చాలా డిఫరెంట్. కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ కంటే అఖిల్ కి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అఖిల్ ట్విట్టర్ లో 2.9 బిలియన్ ఫాలోవర్లు ఉండగా విజయ్ కి 2.7 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. దీంతో విజయ్ దేవరకొండ కంటే అఖిల్ గొప్ప అంటూ అభిమానులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories