Akhil Akkineni Engagement: అఖిల్‌ అక్కినేని నిశ్చితార్థం.. పిక్స్ వైరల్..!

Akhil Akkineni Engagement: అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) నిశ్చితార్థం, అక్కినేని నాగార్జున ట్వీట్‌

Akhil Akkineni Engagement
X

Akhil Akkineni Engagement

Akhil Akkineni Engagement: టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జైనబ్‌ రవ్జీతో అయ్యగారి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, అఖిల్‌ తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో తెలిపారు. అఖిల్‌ నిశ్చితార్థాన్ని ప్రకటిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామని, జైనబ్‌ తమ కోడలు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ యువ జంటను అందరూ ఆశీర్వదించాలని కోరారు. అఖిల్‌, జైనబ్‌ జంట జీవితాంతం ప్రేమ, ఆనందంతో జీవించాలని తాము కోరుకుంటున్నామని కింగ్ పేర్కొన్నారు.

అక్కినేని అఖిల్‌, జైనబ్‌ రవ్జీల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అఖిల్‌ ఇలా సడన్ సర్‪‌ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం అయ్యగారి నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే ఈ జైనాబ్ అని తెలుస్తోంది. జైనబ్‌కు స్కిన్ కేర్‌కి సంబంధించిన ఓ కంపెనీ ఉన్నట్లు సమాచారం. భారత్, దుబాయి, లండన్‌లో ఆమె పెరిగారు.

అక్కినేని అఖిల్‌, జైనబ్‌ రవ్జీలు కొన్నాళ్ల క్రితం కలుసుకోగా.. పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు.. పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. డిజైనర్ శ్రియా భూపాల్‌తో 2016లో అయ్యగారి నిశ్చితార్థం జరగగా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. ఇక డిసెంబరు 4న అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్లల వివాహం జరనున్న నేపథ్యంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగడం విశేషం.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story