Akhil Akkineni - నాకు తగలాల్సిన దెబ్బ ఆయనకి తగిలింది...

Akhil Akkineni: సురేందర్ రెడ్డి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అఖిల్

Dhatripriya
Published on: 16 April 2023 2:34 PM IST
Akhil Akkineni Shocking Comments On Surender Reddy
X

Akhil Akkineni: "సురేందర్ రెడ్డి నన్ను కాపాడారు"

Akhil Akkineni: యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా ఇప్పుడు "ఏజెంట్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "సైరా నరసింహారెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరియర్ లోని మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమాతో అయినా మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అని వేచి చూడాల్సి ఉంది. గతంలో సినిమాపై మంచి బజ్ వచ్చింది కానీ ఈ మధ్య సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గుతూ వస్తుంది.

సినిమా నుంచి విడుదలైన పాటలకు కూడా పెద్దగా మంచి ఆదరణ లభించలేదు. మరోవైపు సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. గత కొద్ది రోజులుగా చిత్ర బృందం వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూ లతో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ సురేందర్ రెడ్డి గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

షూటింగ్ సమయంలో ఒక పెద్ద ప్రమాదం సంభవించిందని కానీ సురేందర్ రెడ్డి తన ప్రాణాలని కాపాడాడని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు అఖిల్. " షూటింగ్ అప్పుడు ఒక చిన్న సెట్ వేశాము. నేను దాని మధ్యలో నిల్చుని ఉన్నాను. గాలికి సెట్ ఊగడం మొదలు అయింది. అపుడు నన్ను కాపాడడానికి సురేందర్ రెడ్డి గారు పరుగెత్తుకుంటూ వచ్చారు. దాంతో నాకు తగలాల్సిన దెబ్బ ఆయనకు తగిలింది. సెట్ లో ఎవరూ రాలేదు కానీ ఆయనే ముందు కదిలాడు" అని సురేందర్ రెడ్డి తనని కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అఖిల్.

Dhatripriya

Dhatripriya

Next Story