logo

అఖిల్ సినిమా అధికారిక ప్రకటన

అఖిల్ సినిమా అధికారిక ప్రకటన
Highlights

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ ఆ మూడు సినిమాలు ఈ అక్కినేని వారసుడికి కేవలం...

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ ఆ మూడు సినిమాలు ఈ అక్కినేని వారసుడికి కేవలం చేదు అనుభవాలను మాత్రమే మిగిల్చాయి. 'అఖిల్' సినిమా డిజాస్టర్ తర్వాత 'హలో' సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు కానీ కలెక్షన్ల పరంగా ఆ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక తాజాగా విడుదలైన అఖిల్ 3వ సినిమా 'మిస్టర్ మజ్ను' కూడా ఫ్లాప్ అయింది. గత కొంతకాలంగా అక్కినేని 4వ సినిమా గురించిన బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి తాజాగా అఖిల్ తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది.

అఖిల్ నాలుగవ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తం షాట్ ఈ నెల ఆఖరి వారంలో లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండవ వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది ఇక ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది తాజాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కానీ ఆమె ఒప్పుకోక పోతే ఈ సినిమా కోసం ఒక కొత్త అమ్మాయిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ లేదా డిసెంబర్లో విడుదల కానుంది.

లైవ్ టీవి

Share it
Top