Most Eligible Bachelor: మళ్లీ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళిన అఖిల్ సినిమా

admin1
Updated on: 27 Aug 2021 11:46 AM IST
Akhil Most Eligible Bachelor Movie Shooting Resumes Again
X

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Most Eligible Bachelor Movie: వరుసగా మూడు సినిమాలు చేసినా సరే అక్కినేని హీరో అఖిల్ ఒక్క సినిమాతో కూడా చెప్పుకోదగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు. తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" పైన పెట్టుకున్నాడు ఈ యువ హీరో. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా షూటింగ్ మరొక సారి సెట్స్ పైకి వెళ్ళబోతోంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకనిర్మాతలకు కొన్ని మార్పులు చేస్తే సినిమా మరింత బాగుంటుంది అనిపించిందట. ఈ నేపథ్యంలో నే సినిమా షూటింగ్ ని మరొక సారి సెట్స్ పైకి వెళ్ళింది. కొన్ని కొత్త సన్నివేశాలు మరియు మార్పులు చేయాల్సిన కొన్ని సన్నివేశాలను కలిపి షూటింగ్ నీ సెట్స్ పైకి తీసుకువెళ్ళారు.

ఎప్పుడో మే 2019 లో సెట్స్ పైకి వెళ్ళిన సినిమా 27 నెలలు అయింది కానీ ఇంకా విడుదలకు సిద్ధం కూడా కాలేదు అంటూ ఫ్యాన్స్ కోపగించుకొంటున్నారు.బన్నీ వాసు మరియు వాసు వర్మ, జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story