Akhil Akkineni: ఏజెంట్ కు పెద్దమ్మ హిట్టిచ్చేనా..?

Lets see if Peddamma Sentiment Workout will get a Hit for Akhil
x

Agent: ఏజెంట్ కు పెద్దమ్మ హిట్టిచ్చేనా..

Highlights

Agent: అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన ఏజెంట్ మూవీ ఈ నెల 28న థియేటర్స్ లోకి రానుంది.

Agent: అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన ఏజెంట్ మూవీ ఈ నెల 28న థియేటర్స్ లోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏజెంట్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను దర్శకుడు యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు. నువ్వెందుకు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయింది. ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ కోసం మమ్ముట్టి టీమ్ అఖిల్ ను రంగంలోకి దింపడం...ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో అఖిల్ కు ఎదురైన సవాళ్ల నేపథ్యంగా ఏజెంట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.

ఏజెంట్ ట్రైలర్ లో అఖిల్ ను చంపేయమని మమ్ముట్టి ఆర్డర్ వేయడం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. మమ్ముట్టి అలా ఎందుకు అన్నారా అని క్యూరియాసిటీ జనరేట్ అయింది. అఖిల్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. అదే విషయాన్ని సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే అని మమ్ముట్టి చెప్పిన డైలాగ్ అఖిల్ పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చినట్లయింది.

ఏజెంట్ మూవీలో అఖిల్ చాలా సాహసాలే చేసినట్లు అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అదిరిపోయే స్టంట్స్ తో పాటు పెద్ద పెద్ద గన్స్ వాడినట్లు అర్థమవుతోంది. కేజీఎఫ్ మూవీ తరహాలోనే ఏజెంట్ మూవీలో కూడా హెవీ మెషీన్ గన్ వాడారు. కేజీఎఫ్ మూవీలో హెవీ మెషీన్ గన్ ను పెద్దమ్మగా వ్యవహరించారు. కేజీఎఫ్ తర్వాత కమల్ హాసన్ విక్రమ్ మూవీలో..పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్ కూడా హెవీ మెషీన్ గన్ వాడారు. ఇవి భారీ హిట్లు అయ్యాయి. మరి పెద్దమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయి అఖిల్ కు సైతం హిట్టు దక్కుతుందేమో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories