Nithin Mehta: సినిమాల కోసం ఆర్మీని వదులుకున్న బాలయ్య విలన్

Nithin Mehta: బాలయ్య సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్మీ ఆఫీసర్

admin1
Published on: 4 Dec 2021 1:03 PM IST
Akhanda Movie Villain Nitin Mehta Leave Indian Army for Movies
X

అఖండ సినిమా లో విలన్ పాత్ర పోషించిన నితిన్ మెహతా (ఫైల్ ఇమేజ్)

Nithin Mehta: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా "అఖండ". ఒకవైపు బాలకృష్ణ నటన మరోవైపు బోయపాటి టేకింగ్ తో పాటు తమన్ సంగీతానికి కూడా అందరూ ఫిదా అయిపోయారు. ఇక మెయిన్ విలన్ పాత్రలో కనిపించిన శ్రీకాంత్ కూడా చాలా బాగా నటించారు అయితే ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది మాత్రం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నితిన్ మెహతా. ఇంతకుముందు భారత సైన్యంలో 21 సంవత్సరాల పాటు సేవలు అందించిన నితిన్ మెహతా కు ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని కలలు కన్నారు.

ఆ కల నెరవేర్చుకోడానికే తనకెంతో ప్రియమైన ఆర్మీ యూనిఫామ్ ను సైతం వదులుకున్నారట. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు రాలేదు కానీ ఇప్పుడు 'అఖండ' సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు నితిన్ మెహతా. ట్రైలర్ లోనే అందరి దృష్టి ఆకర్షించిన నితిన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఉన్నారంటూ సోషల్ మీడియాలలో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక నితిన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తాయని 48 ఏళ్ళ నితిన్ మెహతా ఆశిస్తున్నారు.

admin1

admin1

Next Story