Srikanth: శ్రీకాంత్ కి ఏ మాత్రం ఉపయోగపడని "అఖండ"

* అనుకున్నంత విజయం సాధించలేక పోయిన శ్రీకాంత్

admin1
Updated on: 4 Dec 2021 10:54 AM IST
Akhanda Movie Villain Character is Not Much Useful for Srikanth
X

శ్రీకాంత్ కి ఏ మాత్రం ఉపయోగపడని అఖండ(ఫైల్ ఫోటో)

Srikanth: లెజెండ్ సినిమాతో అప్పటిదాకా సినిమాలు లేకుండా ఉన్న జగపతి బాబు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారడంతో పాటు జగపతిబాబు విలన్ గా ఒక కొత్త కెరీర్ వచ్చింది. తాజాగా అఖండ సినిమా కూడా తనకి అదే విధమైన విజయాన్ని అందిస్తుందని సీనియర్ హీరో శ్రీకాంత్ ఆశపడ్డారు. గత కొంతకాలంగా సినిమాలలో కనిపించకుండా పోయిన శ్రీకాంత్ తాజాగా "అఖండ" సినిమాలో విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు లాగా శ్రీకాంత్ కెరీర్ కూడా ఈ సినిమాతో మారిపోతుందని అందరూ అనుకున్నారు.

శ్రీకాంత్ కి కూడా ఈ సినిమాలో స్ట్రాంగ్ విలన్ పాత్రను ఇచ్చారు బోయపాటి. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ పాత్ర శ్రీకాంత్ కెరియర్ కి అంతగా ఉపయోగపడేలా అనిపించడంలేదు. శ్రీకాంత్ ఎంట్రీ సన్నివేశం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ తర్వాత నుంచి ఆయన కనిపించే ప్రతి సన్నివేశంలోనూ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. కేవలం పంచ్ డైలాగులు తప్ప ఆ పాత్రకి వేరే ప్రాధాన్యత లేకుండా పోయింది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ఉండటం తో శ్రీకాంత్ పాత్ర అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు.

admin1

admin1

Next Story