Akhanda: ఆస్ట్రేలియాలో కూడా సత్తా చాటుతున్న బాలయ్య అఖండ

Akhanda: అప్పుడే హౌస్ఫుల్ అయిపోతున్న అఖండ థియేటర్లు

admin1
Updated on: 27 Nov 2021 4:31 PM IST
Akhanda Movie Tickets are House Full in Australia I Max Theater
X

 ఆస్ట్రేలియాలో కూడా సత్తా చాటుతున్న బాలయ్య అఖండ (ఫైల్ ఇమేజ్)

Akhanda: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షో ఆన్ లైన్ టికెట్లు బుకింగ్ ఈ మధ్యనే ఓపెన్ అయింది. అయితే బుకింగ్ ఓపెన్ అయిన కొంతసేపటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఉన్న ఐమాక్స్ లో ఉదయం ఏడు గంటలకి డిసెంబర్ 2న అఖండ సినిమా ప్రీమియర్ కాబోతోంది. ఆ ప్రీమియర్ షో టికెట్లు హౌస్ఫుల్ అయిపోవడం విశేషం. చూస్తూ ఉంటే కేవలం భారతదేశంలో మాత్రమే కాక బాలకృష్ణ క్రేజ్ ప్రపంచం నలుమూలలా ఉందని నిరూపించేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ.

admin1

admin1

Next Story