'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.. శ్రీవారిని దర్శించుకున్న..

Akhanda Movie Team: కరోనాతో డీలా పడిపోయిన సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరిపోసిందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 12:49 PM IST
Akhanda Movie Team Visit Tirumala Temple
X

'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.. శ్రీవారిని దర్శించుకున్న..

Akhanda Movie Team: కరోనాతో డీలా పడిపోయిన సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరిపోసిందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. శ్రీవారి దర్శనార్థం నిన్నరాత్రి తిరుమలకు చేరుకున్న సినిమా యూనిట్, ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిలకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. అఖండ చిత్రానికి అఖండ విజయం చేకూర్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story