Akhanda Movie: హాట్ స్టార్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్న అఖండ

Akhanda Movie: ఓటిటి లో కూడా అదే జోరు కనబరుస్తున్న అఖండ

admin1
Updated on: 23 Jan 2022 11:30 AM IST
Akhanda Movie is Creating Records  in Hot Star | Tollywood News
X

ఓటిటి లో కూడా అదే జోరు కనబరుస్తున్న అఖండ

Akhanda Movie: సీనియర్ హీరో బాలకృష్ణ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. "సింహా", "లెజెండ్" సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు నమోదు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో మాత్రమే కాక డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా అదే జోరు కనబరుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న అఖండ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా అఖండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హాట్స్టార్ లో విడుదలైన 24 గంటల్లోనే సినిమా పడి లక్షలకు పైగా వ్యూస్ పొంది రికార్డు సృష్టించింది. బాలకృష్ణ అద్భుతమైన నటన, బోయపాటి మార్క్ సన్నివేశాలు, ఎస్.ఎస్.తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్లు గా మారాయి. కేవలం తెలుగులో మాత్రమే కాక పర బాషా ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరియు శివుడి కాన్సెప్టుతో విడుదల కావడంతో సినిమాకి మరింత క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా అఖండ మరి కొన్ని రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు.

admin1

admin1

Next Story