Akhanda Movie:'అఖండ' నుంచి ఫస్ట్ సింగిల్... ఎప్పుడంటే!

Akhanda Movie First Single To Be Released On May 28
x

బాలయ్య బాబు (ఫొటో ట్విట్టర్)

Highlights

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న 'అఖండ' సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న 'అఖండ' సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలో బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినందం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ ఆఘోర పాత్రలో ఆయన కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లతో ఫుల్ ఖుషీలో ఉన్నారు బాలకృష్ణ ఫ్యాన్స్‌. అయితే త్వరలోనే ఈ చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్ ఇవ్వనుందట. ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని.. మే 28న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. నటి పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories