Akhanda Movie: రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న అఖండ

Akhanda Records: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 28 Jan 2022 4:49 PM IST
Akhanda Creating records upon records
X

రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న అఖండ

Akhanda Records: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచి అదే రేంజ్ కలెక్షన్లు కనబరుస్తున్న అఖండ సినిమా ఈ మధ్యనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. బాలయ్య కెరీర్ మొత్తం మీద 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది "అఖండ".

అంతేకాకుండా 2021 లో విడుదలైన అన్ని తెలుగు సినిమాలలోనూ అతి పెద్ద హిట్ గా భారీ వసూళ్లు చేసిన సినిమాగా అఖండ రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం అఖండ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా అదే జోరును చూపిస్తూ వస్తోంది సినిమా. ఈ మధ్యకాలంలో బాలయ్య పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగేలా చేసిన సినిమా "అఖండ". ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, పూర్ణ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. బోయపాటి టేకింగ్, బాలకృష్ణ అద్భుతమైన నటన మరియు తమన్ సంగీతం సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.

admin1

admin1

Next Story