Akhanda and Acharya: "ఆచార్య", "అఖండ" లకు ఖాళీలే లేవా?

Akhanda and Acharya: చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలు అన్నీ తమ విడుదల తేదీలను ప్రకటించటం మొదలుపెట్టారు.

admin1
Published on: 3 Aug 2021 6:48 PM IST
Akhanda and Acharya These Films have no Place in the Dussera or Sankranthi 2022
X

Akhanda and Acharya: "ఆచార్య", "అఖండ" లకు ఖాళీలే లేవా?

Akhanda and Acharya: చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలు అన్నీ తమ విడుదల తేదీలను ప్రకటించటం మొదలుపెట్టారు. ఇప్పటికే "పుష్ప" పార్ట్ 1 ఈ ఏడాది ఆఖరులో క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేయగా, వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పరశురామ్ కాంబినేషన్లో రాబోతున్న "సర్కారు వారి పాట" మరియు పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న మలయాళం సినిమా "అయ్యప్పనుమ్ కోషియుమ్" రీమేక్ సంక్రాంతి బరిలో దిగనున్నాయి. కానీ చూస్తుంటే సీనియర్ హీరోల సంగతి ఎటూ కాకుండా ఉన్నట్టుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" మరియు నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు సినిమాలకి కేవలం దీపావళి లేదా క్రిస్మస్ కి మాత్రమే ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవడానికి సిద్ధంగా ఉన్నారా వేరు వేరు విడుదల తేదీలను ఎంచుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న "ఆచార్య" సినిమాలో రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించనున్నారు. మరోవైపు "సింహ" మరియు "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో మూడవ చిత్రంగా "అఖండ" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

admin1

admin1

Next Story