Akhanda: యూట్యూబ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్న అఖండ టైటిల్

Akhand Movie Title Roar Teaser Creating New Record on Youtube
x

అఖండ ఫైల్ ఫోటో

Highlights

Akhanda Movie Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడో చిత్రం 'అఖండ' . ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్...

Akhanda Movie Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడో చిత్రం 'అఖండ' . ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ జోడీ ఇప్పుడు 'అఖండ' అంటూ బరిలోకి దిగబోతోంది. అయితే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. మే 28న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.

బాలయ్య-బోయపాటి కాంబోలో రుదిద్దుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూనే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటోంది. బాలయ్య గెటప్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియోలో 'కాలుదువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ తనదైన స్టైల్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ మాస్ ఆడియన్స్‌కి కిక్కిచ్చింది. థమన్ బ్యాక్ గ్రౌడ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది.

ఈ టీజర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఇప్పటికే ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. బాలయ్య మూవీస్ లో ఒక్కరోజులోనే అన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. సెలబ్రీటీలు సైతం బాలయ్య లూక్ పై ట్వీట్స్ చేస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ రోర్, ఫస్ట్ లుక్ పోస్టర్ల సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మరో నాయిక పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories