Chor Bazaar Movie: 'జార్జిరెడ్డి' డైరెక్టర్‌తో పూరి న్యూ మూవీ

Chor Bazaar Movie: జార్జిరెడ్డి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు జీవన్ రెడ్డి కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

Samba Siva Rao
Published on: 18 Feb 2021 8:34 PM IST
Chor Bazaar Movie: జార్జిరెడ్డి డైరెక్టర్‌తో పూరి న్యూ మూవీ
X

Chor Bazaar Movie: ప్రముఖ దర్శకుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడి ఆకాశ్ పూరి మూడో మూవీ ఫిక్స్ అయింది. 'జార్జిరెడ్డి' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు జీవన్ రెడ్డి కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, జీవన్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా రానుంది. ఈ సినిమాకు 'చోర్ బజార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చోర్ బజార్‌ అంటే దొంగిలించిన వస్తువులను అమ్మే చోటు. అయితే ఈ కథను విభిన్నంగా తెరకెక్కించనున్నారట దర్శకుడు జీవన్ రెడ్డి.

Akash puriఆకాశ్ పూరి హీరోగా 'ఆంధ్రాపోరీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ 'మెహబూబా'మూవీలోని తన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. పూరి జగన్నాథ్, చార్మి నిర్మాతలు. కేతికా శర్మ హీరోయిన్ గా ఆకాశ్ తో జడీ కట్టింది.

'చోర్ బజార్' Chor Bazaar Movie విషయానికి వస్తే.. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'చోర్ బజార్' చిత్రంలో సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, 'లేడీస్ టైలర్' ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. వి ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్‌పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా.. తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి.ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ను అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story