పూరి జగన్నాథ్ పై ఉన్న పుకార్లపై రియాక్ట్ అయిన ఆకాష్ పూరి

Akash Puri About His Mom-Dads Love Story
x

పూరి జగన్నాథ్ పై ఉన్న పుకార్లపై రియాక్ట్ అయిన ఆకాష్ పూరి

Highlights

Akash Puri: ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు "చోర్ బజార్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Akash Puri: ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇప్పుడు "చోర్ బజార్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఒక దర్శకుడిగా పూరి జగన్నాథ్ కరియర్లో బోలెడు బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అన్నే పుకార్లు బయట వినిపిస్తూ ఉంటాయి. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అని చాలా వదంతులు వినిపించాయి. తాజాగా ఈ పుకార్లపై ఆకాష్ పూరి రియాక్ట్ అయ్యారు.

"పెంపుడు కుక్కలకు కూడా ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న డాడీ వాటిని ఫ్రెండ్స్ కి ఇచ్చేసారు. కానీ ఆ విషయం మాకు చాలా రోజుల వరకు మా అమ్మ తెలియకుండా చేసింది. ఆ సమయంలో మా డాడీ కి సపోర్ట్ గా నిలిచింది మా అమ్మే. అలాంటి వాళ్లు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటారు? మా అమ్మానాన్నలు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరోజు డాడీ ఫోన్ చేసి నిన్ను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను. నాతో వచ్చేస్తవా? కానీ నా జేబులో 200 ఉన్నాయి. రేపు అవి కూడా ఉంటాయో లేదో తెలియదు అని అన్నారట. అయినా ఓకే అని మా అమ్మ వచ్చేసింది. నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా అమ్మ వచ్చేసిందని తెలిసి నా మతిపోయింది. అంత ప్రేమతో ఉన్న అమ్మానాన్నలు ఎందుకు విడిపోతారు? అవన్నీ పుకార్లే" అంటూ కొట్టిపారేశాడు ఆకాష్.

Show Full Article
Print Article
Next Story
More Stories