Ajith: ముచ్చటగా మూడోసారి?

Ajith: ‘వాలిమై’‘నెర్కొండ పార్వ్యై’ అదే కాంబోలో ముచ్చటగా మూడోసారి సిద్ధమైనట్లు సమాచారం.

Kranthi
Published on: 19 Jun 2021 9:27 AM IST
Ajith: ముచ్చటగా మూడోసారి?
X

Ajith,Boney Kapoor:(The Hans India)

Ajith: తమిళనాడు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన అజిత్.. వరుస సినిమాలతో కేక పుట్టించనున్నాడు. కరోనా వల్ల సినిమాలు ఆగిపోయిన వేళ.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించనున్నాడు. కరోనా సమయంలో కాంపిటీటర్ విజయ్ మాస్టర్ సినిమా ఒక్కటే రిలీజైంది. మరోవైపు అజిత్ సినిమా ఏదీ రాకపోవడంతో.. ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. కాని ఇప్పుడు అతి త్వరలో వాలిమై సినిమా రిలీజ్ కాబోతుండటమే కాకుండా.. ఆ వెంటనే సేమ కాంబినేషన్ లో కొత్త సినిమా కూడా అనౌన్స్ చేసి.. రెండు నెలల్లోనే దానిని కంప్లీట్ చేసి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.

కథానాయకుడు అజిత్‌.. దర్శకుడు హెచ్‌.వినోద్‌ ల కలయికలో మరో కొత్త చిత్రం రానుందా? 'వాలిమై' పూర్తయిన వెంటనే ఆ సినిమా పట్టాలెక్కుతుందా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ప్రస్తుతం అజిత్‌ - వినోద్‌ల కలయికలో 'వాలిమై' సినిమా సెట్స్‌పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. 'నెర్కొండ పార్వ్యై' వంటి హిట్‌ తర్వాత ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.

ఇంకా మూడు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. ఇది పూర్తయిన వెంటనే.. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం. దీనికీ బోనీ కపూరే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా దీన్ని పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, 'వాలిమై' పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని కోలీవుడ్‌ చెబుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Kranthi

Kranthi

Next Story