Pushpa Movie: సుకుమార్ గారు నాతో అరగంట మాట్లాడారు అంటున్న అజయ్ ఘోష్

Pushpa Movie: "పుష్ప సినిమా నుండి తప్పుకోవాలని అనుకున్నాను" అంటున్న అజయ్ ఘోష్

admin1
Updated on: 21 Dec 2021 4:21 PM IST
Ajay Ghosh Shares his Working Experience With Director Sukumar in  Pushpa Movie | Pushpa Movie
X

"పుష్ప సినిమా నుండి తప్పుకోవాలని అనుకున్నాను" అంటున్న అజయ్ ఘోష్ (ఫైల్ ఫోటో) 

Ajay Ghosh - Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించిన అజయ్ ఘోష్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే. కానీ అసలు అయితే ఈ సినిమాలో అజయ్ ఘోష్ ముందు నటించనని చెప్పారట. "నేను ఈరోజు మీ ముందు ఉన్నాను అంటే అది పుష్ప సినిమా వల్లే అని చెప్పాలి.

నాకు ఈ సినిమా నాకు పునర్జన్మ నిచ్చింది నిజానికి ఈ సినిమా నేను చేయకూడదు అనుకున్నాను దానికి కారణం నాకు కరోనా రావడం" అని అన్నారు అజయ్ ఘోష్." కరోనా ఫస్ట్ వేవ్ రావడానికి కొన్ని నెలల ముందే నాకు హార్ట్ లో స్టెంట్ వేశారు. అప్పటినుండి బాగానే ఉన్నాను కానీ నాకు కరోనా సోకిందని తెలిశాకా చాలా ఆందోళనకు గురి అయ్యాను. ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ పేరుతో బాగా తెలిసిన వాళ్లు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు అప్పటికీ పుష్ప నేను కమిట్ అయ్యాను కానీ ఈ సినిమా నుండి తప్పుకోవాలని అనుకున్నాను.

కానీ ఒకరోజు సుకుమార్ గారే స్వయంగా ఫోన్ చేసి అరగంట మాట్లాడారు. ఆయనతో మాట్లాడాక నేను కన్విన్స్ అయిపోయాను. ఆయన నన్ను అంతలా మోటివేట్ చేశారు. మారేడుమిల్లి లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళిపోతాను అని అనే వాడిని ఒకసారి నన్ను నార్మల్ మూడ్ లోకి తీసుకు రావటానికి సుకుమార్ గారు డాన్స్ కూడా చేశారు. నాలో హుషారు నింపారు. సినిమా అంటే ఆయనకు అంత తాపత్రయం" అని చెప్పుకొచ్చారు అజయ్ ఘోష్.

admin1

admin1

Next Story