బాలీవుడ్ లోకి 'బ్రోచేవారెవరురా'!

బాలీవుడ్ లోకి బ్రోచేవారెవరురా!
x
Highlights

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కామెడీ , రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెర‌కెక్క‌న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథ పెతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రయదర్శిని తదితరులు నటించారు.

ఈ మధ్య తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి బాగా రీమేక్ అవుతున్నాయి.. ఇప్పటికే అర్జున్ రెడ్డితో పాటుగా చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. దీనితో అక్కడ తెలుగు సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పడడంతో మరిన్ని సినిమాలను మేకర్స్ రీమేక్ చేస్తున్నారు. జెర్సీ, మిధునం, చత్రపతి సినిమాలు ప్రస్తుతం అక్కడ రీమేక్ అవుతున్నాయి. అయితే ఈ జాబితాలోకి మరో సినిమా కూడా చేరిపోయింది. అదే బ్రోచేవారెవరురా.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కామెడీ , రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెర‌కెక్క‌న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథ పెతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రయదర్శిని తదితరులు నటించారు.

అయితే ఈ సినిమా బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కు బాగా న‌చ్చ‌డంతో వెంటనే బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ భావించారట.. అభయ్ డియోల్, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేసి చిత్రాన్ని రీమేక్ చేసి త్వరలొనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories