గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్క‌లు నాటిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌

Arun Chilukuri
Updated on: 18 Dec 2020 5:27 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్క‌లు నాటిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌
X

దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎లో పాల్గొని ప్రజల్లో పర్యావరణం పట్ల చైతన్యం నింపుతున్నారు. నిన్న బాలీవుడ్ ఉస్తాద్ సంజయ్ దత్ మొక్కలు నాటితే ఇవాళ బాలీవుడ్ సుప్రీం హీరో అజయ్ దేవ్‎గణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే తాను NY ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపిన అజయ్.. ఇక నుంచి "NY" ఫౌండేషన్ కార్యక్రమాల్లో "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"ను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. కోట్లాది మొక్కలు నాటించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కు అజయ్ దేవ్‎గణ్ శుభాకాంక్షలు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story