టాలీవుడ్ పై కన్నేసిన దేవగన్ జంట

Ruthvik
Published on: 26 April 2019 11:29 AM IST
టాలీవుడ్ పై కన్నేసిన దేవగన్ జంట
X

నాలుగు పదుల వయసు పైబడినా కానీ ఇంకా అంతే అందం గా కనిపిస్తుంది కాజోల్. అజయ్ దేవగన్ ని వివాహం చేసుకున్నాక కొన్నాళ్ళు సినిమాలకి దూరం గా ఉంది తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కాజోల్. డిడిఎల్‌జే సినిమాతో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్న కాజోల్ దక్షిణాది పరిశ్రమ లో తన శక్తి మేరకు రాణించాలి అని తపన ని వ్యక్తపరుస్తుంది కాజోల్. ఆ మధ్య ధ‌నుష్ నిర్మించిన‌ త‌మిళ సినిమా వీఐపీ 2 లో కీల‌క పాత్ర పోషించిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ లో కూడా నటిద్దామ్ అనుకున్న కాజోల్ ఎందుకో ఆ ఆలోచన ని అప్పుడు విరమించుకుంది.

అయితే తాజాగా తన భర్త అజయ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తో తెలుగు లో కి అడుగు పెడుతుండడం తో కాజోల్ కూడా తెలుగు లో సినిమాలు చేయాలనే ఆసక్తి ని కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. కాజోల్ ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చి వారితో మాట్లాడింది. "మంచి కథ తో పాటు మంచి పాత్ర ని ఎవరైనా ఆఫర్ చేస్తే నటించడానికి నేను సిధ్ధమే." అని కాజోల్ మీడియా కి తెలిపింది. టబు వంటి హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వనుండటం తో కాజోల్ కూడా ఏదైనా మంచి దర్శకుడి చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందు వస్తే బాగుంటుంది.

Ruthvik

Ruthvik

Next Story