ఓటీటీ లాపై దృష్టి పెట్టనున్న అజయ్ భూపతి

Ajay Bhupathi: ఓటీటీ తో అదృష్టం పరీక్షించు కోనున్న అజయ్ భూపతి

admin1
Updated on: 6 Feb 2022 1:00 PM IST
Ajay Bhupati will Focus On OTT
X

ఓటీటీ లాపై దృష్టి పెట్టనున్న అజయ్ భూపతి

Ajay Bhupathi: "ఆర్ ఎక్స్ 100" సినిమా విడుదల సమయంలో అజయ్ భూపతి రొటీన్ సినిమాలు చేయనని ప్రేక్షకులు థియేటర్ లకి వచ్చి చూసే లాంటి మంచి సినిమాలు మాత్రమే తీస్తానని స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సినిమా తో బాగానే ఆకట్టుకున్న అజయ్ భూపతి తన రెండవ సినిమా తో మాత్రం అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన "మహా సముద్రం" సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. ఎలాంటి సినిమాలు తీస్తానని చెప్పి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటూ అభిమానులు సైతం అజయ్ పై మండిపడ్డారు.

ఇక తాజాగా అదే భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి ఈసారి ఓటీటీ ఫ్లాట్ఫామ్ హాట్స్టార్ కోసం ఒక ప్రాజెక్టుని సైన్ చేశారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయింది. అతి త్వరలోనే ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేయబోతున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా అజయ్ భూపతి హిట్ అందుకుంటారా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story