Pushpa Movie: 'పుష్ప'లో మరో బ్యూటీ.. కథకే కీలకం కానుందంట

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ మూవీ పుష్ప.

Venkata Chari
Published on: 27 April 2021 8:37 AM IST
Pushpa: Aishwarya Rajesh Will Screen Share With Allu Arjun
X

పుష్పలో అల్లు అర్జున్ (ఫొటో ట్విట్టర్)

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ మూవీ పుష్ప. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లతో సినిమాపై అంచనాలు పెంచేశాడు సుక్కు. ప్రతి సినిమాను ఎంతో పద్ధతిగా తెరకెక్కించి హిట్ కొడుతుంటాడు ఈ క్రీజీ డైరెక్టర్. పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈ సినిమాలో పాత్రలను కూడా అదే రేంజ్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నారంట. తాజాగా పుష్ప సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యాంకర్ అనసూయను తీసుకున్నారని, ఆమె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. అనసూయనే కాదు.. పుష్ప కోసం మరో బ్యూటీని కూడా లైన్ లో పెట్టారంట సుక్కు. అల్లు అర్జున్ చెల్లిలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ని ఓకే చేశారంట.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. గత కొన్ని నెలలుగా నిర్విరామంగా షూటింగ్ చేస్తుంది యూనిట్. ఇప్పటికే మేజర్ సన్నివేశాల చిత్రీకరణ అయిపోయిందంట.

ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) (ఫొటో ట్విట్టర్)

అయితే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో సాగుతుందనే పుకార్లు ఇంతకుముందే హల్‌చల్ చేశాయి. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. హీరో అమితంగా ఇష్టపడే తన చెల్లెలు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా మరణిస్తుందంట. ఈ కారంణతోనే పుష్పరాజ్ అడవుల్లో అడుగుపెడతాడంట. అలా మొదలైన కథ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆడియోన్స్‌ని ఆకట్టుకుంటుందంట. ఇలాంటి పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ని ఓకే చేశారని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయనుంది క్రేజీ బ్యూటీ రష్మిక మందాన్న. గిరిజన యువతిగా ఆమె అప్పీయరెన్స్ సినిమాలో చాలా కీలకం కానుందంట. పుష్పకు సహాయం చేసే పాత్రలో కన్నడ బ్యూటీ నటిస్తోందట. విలన్ పాత్రలో నేషనల్ వైడ్ బెస్ట్ టాలెంటెడ్ నటుల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అలాగే ఊర్వశీ రౌతేలా తో ఐటమ్ సాంగ్ భారీగానే ప్లాన్ చేశారట.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు మ్యూజికల్ హిట్స్ సాధించాయి.

Venkata Chari

Venkata Chari

Next Story