Aishwarya Rajesh: సమంత తన రోల్ మోడల్ అంటున్న నాని హీరోయిన్

Aishwarya Rajesh: ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేష్

admin1
Published on: 28 Sept 2021 4:13 PM IST
Aishwarya Rajesh Says Samantha is My Role Model
X

ఐశ్వర్య రాజేష్ (ఫైల్ ఇమేజ్)

Aishwarya Rajesh: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "రిపబ్లిక్" సినిమా ఎటువంటి హంగామా లేకుండా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో అయిన సాయితేజ్ ఈవెంట్ కి రాలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ రావటం మరియు ఆయన స్పీచ్ సినిమాకి బాగానే హైప్ ని క్రియేట్ చేశాయి. టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఐశ్వర్య రాజేష్.

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐశ్వర్య రాజేష్ తనకు సమంత అంటే చాలా ఇష్టం అని ఆమె ఆక్టింగ్ కి ఆమె పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను రెండు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటోందట. మరోవైపు ఐశ్వర్య రాజేష్ ఈమధ్యనే నాని మరియు రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటించిన "టక్ జగదీష్" సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది.

admin1

admin1

Next Story