Radhe Shyam - Sasha Chettri: "రాధేశ్యామ్"లో ఎయిర్టెల్ బ్యూటీ

Sandeep Reddy
Published on: 2 Aug 2021 4:33 PM IST
Airtel Advertisement Sasha Chettri Playing Key Role in Prabhas Radhe Shyam Movie
X

సాష చెత్రి - ప్రభాస్ 

Sasha Chettri: ఎయిర్టెల్ ప్రకటనలో నటించి దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన పొట్టి జుట్టు పాప సాష చెత్రి గతంలో హీరో ఆది నటించిన "ఆపరేషన్ గోల్డ్ ఫిష్" సినిమాలో హీరోయిన్ గా నటించి అటు యాడ్స్ తోనే కాకుండా వెండితెరపై కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ఎయిర్టెల్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"రాధేశ్యామ్" సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న "రాధేశ్యామ్" చిత్ర యూనిట్ డబ్బింగ్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. "రాధేశ్యామ్" చిత్రంలో సాష చెత్రి సినిమా మొత్తంలో ఒక మిస్టిరియాస్ కీరోల్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. పూర్తి ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కి సాషకి మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని సినీ వర్గాల సమాచారం.

హీరోయిన్ పూజా హెగ్డే తర్వాత సాష చెత్రికే ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే యాడ్స్ లో అదరగొట్టిన ఈ పాప తక్కువ సమయంలోనే ప్రభాస్ తో "రాధేశ్యామ్" భారీ బడ్జెట్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో మొదటి సినిమా "ఆపరేషన్ గోల్డ్ ఫిష్" బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ సాధించలేకపోయిన "రాధేశ్యామ్"తోనైనా సూపర్ హిట్ కొట్టి తెలుగులో హీరోయిన్ గా సెటిల్ అవ్వబోతుందో లేదో చూడాలి ఈ 25 ఏళ్ళ ఎయిర్టెల్ బ్యూటీని. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14 న "రాధేశ్యామ్" విడుదల కాబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటన చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story