Aha: చిన్న సినిమా కోసం భారీ మొత్తాన్ని పెట్టిన ఆహా..

* భారీ మొత్తానికి అమ్ముడైన చిన్న బడ్జెట్ సినిమా

Dhatripriya
Published on: 24 April 2023 11:48 AM IST
Aha Paid Huge Amount For Small Film
X

చిన్న సినిమా కోసం భారీ మొత్తాన్ని పెట్టిన ఆహా

Baby Movie: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులు దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న అలాంటి ఒక చిన్న బడ్జెట్ సినిమా "బేబీ". "హృదయ కాలేయం" ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు "సాఫ్ట్వేర్ డెవలపర్" ఫెమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇక సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమాపై బజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అంతేకాకుండా చిత్ర డిజిటల్ రైట్స్ కి కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ఏకంగా 7.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక చిన్న సినిమా కోసం ఇంత భారీ అమౌంట్ ని పెట్టడం ఇదే మొదటిసారి. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా చిత్ర నిర్మాతలకి భారీ మొత్తాన్ని ఆఫర్లు చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్య చిన్న సినిమాలుగా వచ్చిన మసూద, బలగం వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. మరి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా విలువడాల్సి ఉంది. మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఎస్ కే ఎన్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరోవైపు విజయ్ దేవరకొండ కి వచ్చినంత క్రేజ్ ఆనంద్ దేవరకొండ కి హీరోగా లభించలేదు. ఈ సినిమా పై బజ్ ఎక్కువగా ఉండటంతో ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆనంద్ కి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య కి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

Dhatripriya

Dhatripriya

Next Story