Unstoppable Talk Show: బాలయ్య టాక్ షోకి ముఖ్య అతిథిగా రోజా..!?

* బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్" టాక్ షోకి ముఖ్య అతిథిగా రోజా సెల్వమణి..!!

Sandeep Reddy
Published on: 20 Nov 2021 4:08 PM IST
Aha OTT Platform Planning to Invite Roja as a Guest to Balakrishna Unstoppable Talk Show
X

Unstoppable Talk Show: బాలయ్య టాక్ షోకి ముఖ్య అతిథిగా రోజా..!?

Unstoppable Talk Show: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న"అన్ స్టాపబుల్" టాక్ షోలో సినీ నటి, నగరి ఎంఎల్ఏ రోజా అతిధిగా పాల్గోనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంచు మోహన్ బాబు, నాని వంటి హీరోలను రెండు ఎపిసోడ్ లలో తనదైన స్టైల్ తో ఇంటర్వ్యూ చేసి టాక్ షోలలో మంచి క్రేజ్ సంపాదించిన బాలయ్య అతి త్వరలో తనతో నటించిన రోజాని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాడని.. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం కూడా అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

నవంబర్ 17న రోజా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ.."అన్ స్టాపబుల్" టాక్ షోకి రావాలని రోజాని ఆహ్వానించినట్లు సమాచారం. బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన రోజా - బాలకృష్ణ.. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలలో ఉన్న వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండబోతుందోనని అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story