Agent: విడుదల తేదీ విషయంలో గొడవలు పడుతున్న "ఏజెంట్" బృందం

Agent Team Fighting Over Release Date
x

Agent: విడుదల తేదీ విషయంలో గొడవలు పడుతున్న "ఏజెంట్" బృందం 

Highlights

Agent: "ఏజెంట్" డైరెక్టర్ మరియు నిర్మాత మధ్య విభేదాలు..

Agent: వరుసగా మూడు డిజాస్టర్ ల తర్వాత ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పర్వాలేదు అనిపించిన యువహీరో అక్కినేని అఖిల్ తాజాగా ఇప్పుడు "ఏజెంట్" అనే ప్యాన్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. "సైరా నరసింహారెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర డైరెక్టర్ మరియు నిర్మాతకు సినిమా విడుదల తేదీ గురించి కొన్ని విభేదాలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మరికొంత సమయం తీసుకుని సినిమాని పూర్తి చేసి అప్పుడు విడుదల చేద్దామని సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. కానీ చిత్ర నిర్మాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని 28వ తేదీన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతం చిత్ర విడుదల తేదీ గురించి కన్ఫ్యూజన్ నడుస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఈ విషయంలోనే ఇప్పుడు చిత్ర డైరెక్టర్ మరియు నిర్మాతకి మధ్య కొన్ని విభేదాలు వస్తున్నాయట. మరి ఇద్దరూ కలిసి సినిమాకి ఏ విడుదల తేదీని ఖరారు చేస్తారో వేచి చూడాలి.

నిజానికి సినిమా ప్రకటించి ఎన్నో ఏళ్లు గడిచింది కానీ విభిన్న కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా వారు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories