Akhil Akkineni: అంచనాలను పెంచుతోన్న'ఏజెంట్' ఫస్ట్ లుక్

Agent Raises First Look Expectations
x

Akhil Akkineni:(Photo Twitter)

Highlights

Akhil Akkineni: అఖిల్ అక్కినేని కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఈరోజు తన 27వ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతేకాదు తన సినిమా పేరును కూడా ప్రకటించాడు అఖిల్. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. 'సైరా'తో మరోసారి సత్తా చాటిన సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇక ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఆ లుక్‌లో అఖిల్ అదరగొట్టాడనే చెప్పోచ్చు. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ స్టైలీష్‌గా ఉన్నాడు. ఈ ఫస్టు‌లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.

హీరోలను స్టైలీష్ గా ప్రెజెంట్ చేయడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. అఖిల్తో చేసే ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం. ఈ భారీ యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన నటిస్తుందని టాక్. ఈ సినిమా కోసమే అఖిల్‌ తన లుక్‌ని కూడా మార్చుకున్నారు. దీంట్లో ఆయన కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించనున్నారని సమాచారం.



Show Full Article
Print Article
Next Story
More Stories