Agent Movie: ఆగస్టు నుంచి తప్పుకోనున్న ఏజెంట్

Agent Movie: మళ్లీ వాయిదా పడనున్న ఏజెంట్

Rama Rao
Updated on: 10 May 2022 11:30 AM IST
Agent Movie Postponed Again | Tollywood News
X

ఆగస్టు నుంచి తప్పుకోనున్న ఏజెంట్

Agent Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమైన యువ హీరో అఖిల్ అక్కినేని తాజాగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" తో మంచి హిట్ అందుకున్నారు. ఇక తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ఏజెంట్" పైనే పెట్టుకున్నారు అఖిల్. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అఖిల్ కరియర్ లో ఈ సినిమా మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమాగా మారింది.

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొత్త నటి సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. నిజానికి ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేయాలని చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పోస్టర్లను కూడా విడుదల చేశారు. అంతేకాదు సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

సినిమా విడుదల వాయిదా పడడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మొదటిది సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ రావటం. అలాగే షూటింగ్ సమయంలో అఖిల్ కు చిన్నపాటి గాయాలు కావడంతో షూటింగ్ మళ్ళీ మరింత వాయిదా పడింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో వేచిచూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story