Vikram Release: మళ్లీ వాయిదా పడ్డ "విక్రమ్" విడుదల

Vikram Release: మరింత ఆలస్యం కానున్న "విక్రమ్"

admin1
Updated on: 2 Dec 2021 12:30 PM IST
Again Vikram Movie Release Date was Postponed
X

మల్లి వాయిదా పడ్డ విక్రమ్ సినిమా (ఫైల్ ఇమేజ్)

Vikram Release: ఈ మధ్యనే అమెరికా పర్యటన కి వెళ్లి వచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ ఇప్పుడు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం. కమల్ హాసన్ హాస్పటల్ లో ఉండడం వల్ల ఆయన తదుపరి సినిమా అయిన "విక్రమ్" షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు కమల్ హాసన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాల కోసం చిత్రబృందం పొల్లాచిలో ఒక స్పెషల్ సెట్ ని నిర్మించింది.

కానీ కరోనాకు కమల్ హాసన్ కి కరోనా సోకడంతో షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో నటించాల్సిన నటీనటులు వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం విక్రమ్ చిత్రబృందం దగ్గర్నుంచి డేట్ లు పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర బృందం. షూటింగ్ మళ్లీ వాయిదా పడడంతో సినిమా విడుదల కూడా మరింత వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో విడుదల కాబోతుంది. లోకేష్ కనగారాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఫాహాధ్ ఫాసిల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

admin1

admin1

Next Story