Samantha: ఆహా మ‌ళ్లీ సమంత గుర్తొచ్చిందా??

Again Samanth Back To Aha OTT
x

ఆహ లో సమంత 

Highlights

Samantha: సీజన్-1లో షో డిజైన్ బాగాలేదంటూ పెదవి విరుపులు

Samantha: ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ స‌రికొత్త సినిమాలు, షోలు, వెబ్ సిరీసులతో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌క‌, అక్కినేని స‌మంత హోస్ట్ గా మారి సామ్ జామ్ అనే పొగ్రాం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తిచేసింది. చిరంజీవి, నాగచైతన్య, రానా, అల్లు అర్జున్, రకుల్ లాంటి తారల్ని ఇంటర్వ్యూలు చేసింది. ఆ షో ప‌ర్వాలేద‌నిపించిన‌ప్ప‌టికీ ఆహా టీం ఊహించినంత స‌క్సెస్ ఇవ్వ‌లేద‌నే చెప్పాలి.

ఇప్పుడు మరోసారి సమంతను తెరపైకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఆహా. దీనికి కారణం కరోనా. సెకెండ్ వేవ్ లో మరోసారి ఓటీటీకి గిరాకీ పెరిగింది. థియేటర్లు మూతపడ్డంతో అంతా ఓటీటీపై పడ్డారు. ఇలాంటి టైమ్ లో డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ తో పోటీపడి సినిమాలు దక్కించుకోవడం సిరీస్ లు, సినిమాలు తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంద‌ని టాక్. అంతే కాదు వాటీతో పోటీ సిరీసులు తీయ‌డం సాధ్య‌ప‌డ‌డం లేదు. త‌మ‌న్నా తో 11వ అవ‌ర్ సిరీస్ తీసిన‌ప్ప‌టికీ అది అంతా ఆద‌ర‌ణ‌ లేకుండా పోయింది.

అందుకే సమంతను మరోసారి ఆహా వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నార‌ని స‌మాచారం. అంతా బాగానే ఉంది కానీ, సమంత రాకతో ఆహాకు మైలేజీ పెరుగుతుందా అనేది ఇక్కడ ప్రధాన సందేహం. సీజన్-1లో షో డిజైన్ బాగాలేదంటూ పెదవి విరుపులు పడ్డాయి. వ్యూయింగ్ అవర్స్ పెరగలేదు. సమంత-నాగచైతన్య ఇంటర్వ్యూ మాత్రమే క్లిక్ అయింది. అయితే ఈ సారి మాత్రం ఆహా టీం పక్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories