Mahesh Babu: మళ్లీ అదే డైరెక్టర్ తో చేతులు కలుపబోతున్న మహేష్ బాబు

Mahesh Babu: మరొక సినిమా లైన్ లో పెట్టేసిన సూపర్ స్టార్

admin1
Published on: 19 Oct 2021 5:42 PM IST
Again Mahesh Babu Going to do Film With Director Anil Ravipudi
X

మహేష్ బాబు (ఫైల్ ఇమేజ్)

Mahesh Babu: "భరత్ అనే నేను", "మహర్షి", "సరిలేరు నీకెవ్వరు" వంటి సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై వెలగనున్నారు. "సర్కారు వారి పాట" సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా మహేష్ బాబు మరొక సినిమాని సైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. సరిలేరు నీకెవ్వరు ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఒక సినిమాకి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే విడుదల కాబోతున్న ట్లు సమాచారం. మరోవైపు నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story