Ileana: మరొకసారి రవితేజతో జతకట్టనున్న ఇలియానా

Again Ileana Going to do a Movie With Ravi Teja
x

మరోసారి రవి తేజ తో జత కట్టనున్న ఇలియానా (ఫైల్ ఇమేజ్)

Highlights

Ileana: మరొకసారి ఇలియానాకి సహాయం చేయనున్న రవితేజ

Ileana: "పోకిరి", "రాఖీ", "జులాయి" వంటి సూపర్ హిట్ సినిమాల తో ముందుకు దూసుకుపోతున్న ఇలియానా డి క్రూజ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒకరి గా చలామణి అయింది. కానీ "దేవుడు చేసిన మనుషులు" సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది ఇలియానా. హిందీ లో కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకుల కు మాత్రం ఈమె దర్శనమిచ్చింది తక్కువే. అయితే కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో ఇలియానాకు మళ్లీ బ్రేక్ లు పడ్డాయి.

అయితే తన బాయ్ ఫ్రెండు ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ చేసుకున్న ఇలియానా మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇలియానా కు మంచి స్నేహితుడు అయిన రవితేజ మరొకసారి ఆమెకు సహాయపడాలని ప్రయత్నిస్తున్నారట. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం "ఖిలాడీ" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఇలియానా వెంటనే ఒప్పుకుందట. ఈ సినిమాతో ఇలియానా చాలా కాలం తర్వాత మరొక సారి తెలుగు తెరపై మెరవనుంది. ఆ తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories