సినిమా చూశాక నేను నా భార్యను ఇలా అడిగాను అంటున్న అల్లు అరవింద్

* "ఇంట్లో కూర్చునే అమ్మాయిలు అంటే నాకు నచ్చదు," అంటున్న అల్లు అరవింద్

Dhatripriya
Updated on: 6 Feb 2023 7:00 AM IST
After Watching Writer Padmabhushan Movie I Asked My Wife
X

సినిమా చూశాక నేను నా భార్యను ఇలా అడిగాను అంటున్న అల్లు అరవింద్

Allu Aravind: సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అమ్మాయిలు అందరూ తమ తల్లిదండ్రులు లేదా అన్నయ్య లతో వెళ్లి ఈ సినిమాను చూడాలని అన్నారు అల్లు అరవింద్.

నేను ప్రతిరోజు యంగ్ స్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్లే నాకు ఎనర్జీ. ముందుగా ధీరజ్ మరియు వాసు వచ్చి ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని అన్నారు సినిమా చూశాక నాకు కూడా అదే అనిపించింది," అని అన్నారు అల్లు అరవింద్. "సినిమాలో నాకు బాగా నచ్చింది ఆఖరి సన్నివేశం. ప్రతి అమ్మాయికి కొన్ని ఆశలు ఉంటాయి. వాటిని మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. అమ్మాయిలు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని నేను అనను. బన్నీ భార్యకు స్నేహం కూడా గొప్ప ఇంట్లో పుట్టింది ఇప్పుడు పెద్ద స్టార్ ను పెళ్లి చేసుకుంది. తనకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికీ పని చేస్తూనే ఉంటుంది. ఇంట్లో కూర్చుని అమ్మాయిలు అంటే నాకు నచ్చదు.

సినిమా చూశాక ఇంటికి వెళ్లి నేను నా భార్యని ఏమవ్వాలనుకుందో అడిగాను. కలర్ ఫొటోస్ ఏమో అని కూడా మేము చాలా బాగా ప్రమోట్ చేసి ఆహాలు విడుదల చేశాను ఇది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. సుహాస్ సహజనటుడు అమ్మాయిలకు తన అమాయకత్వం చాలా బాగా నచ్చుతుంది. చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రారు అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా సక్సెస్ కనువిప్పు అవుతుంది," అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

Dhatripriya

Dhatripriya

Next Story