శివరాత్రి తరువాత క్లారిటీ ఇవ్వనున్న స్టైలిష్ స్టార్

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా నెలల తర్వాత...
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చాలా నెలల తర్వాత ఎట్టకేలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఫాన్స్ అందరు ఈ చిత్రం గురించి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం అధికారిక ప్రకటనలు విడుదల చేయడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించిన వినిపించాయి కానీ అందులో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియలేదు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి పూజా హెగ్డే 'డీజే' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇప్పటి దాకా బయటకు వచ్చిన పుకార్లు అన్నిటికీ చిత్రబృందం ఒకేసారి ఫుల్స్టాప్ పెట్టనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గురించిన అన్ని వివరాలు శివరాత్రి పండుగ తరువాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT