మళ్లీ గాయకుడిగా మారనున్న హీరో

కేవలం 'బొమ్మరిల్లు' సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ తెలుగు లో ఎక్కువ కాలం తన ఇమేజ్ ను...
కేవలం 'బొమ్మరిల్లు' సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ తెలుగు లో ఎక్కువ కాలం తన ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల తరువాత కొన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రెండేళ్ల క్రితం 'గృహం' అనే హారర్ సినిమాతో మనముందుకు వచ్చాడు. అయితే సిద్ధార్థ్ ఒక మంచి నటుడు మాత్రమే కాక మంచి సింగర్ కూడా. తాను నటించిన 'బొమ్మరిల్లు', 'ఓ మై ఫ్రెండ్' సినిమాలలో ఇప్పటికే తన టాలెంట్ ను బయటపెట్టిన సిద్దార్థ్ ఇప్పుడు మళ్లీ ఒక తెలుగు సినిమా కోసం గళం విప్పనున్నాడు.
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న హీరో సందీప్ కిషన్ తానే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అని ఒక సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ఒక పాట పాడాడు సిద్ధు. సోమవారం నాడు ఈ పాట రికార్డింగ్ పూర్తయింది. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. సందీప్ తో తనకున్న స్నేహం వల్ల మాత్రమే సిద్ధార్థ్ సినిమాలో పాట పాడటానికి ఒప్పుకున్నాడని చిత్రబృందం చెబుతోంది. ఇక సిద్ధార్థ్ హీరోగా కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT