Vishwak Sen: హీరో విశ్వక్‌ సేన్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

Vishwak Sen: ప్రమోషన్స్ పేరిట ఓ ప్రాంక్ వీడియో తీస్తూ న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్‌ సేన్‌పై పై చర్యలు తీసుకోవాలని...

Arun Chilukuri
Published on: 2 May 2022 6:06 PM IST
Advocate Arun Kumar Complaints On Vishwak Sen Over Prank video
X

Vishwak Sen: హీరో విశ్వక్‌ సేన్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

Vishwak Sen: ప్రమోషన్స్ పేరిట ఓ ప్రాంక్ వీడియో తీస్తూ న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్‌ సేన్‌పై పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ హెచ్చార్సీలో పిటిషన్ వేశారు. విశ్వక్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్‌.ఆర్‌.సి.ని కోరినట్టు తెలిపారు. పెట్రోల్‌ డబ్బాతో అభిమానిని సూసైడ్‌ చేసుకునేలా విశ్వక్‌సేన్‌ ప్రేరేపించారని, అందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్ ను హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story