హిట్ సిరీస్ ఒక యూనివర్స్ అంటున్న అడివి శేష్

Adivi Shesh Compares the Hit series to Marvel
x

హిట్ సిరీస్ ఒక యూనివర్స్ అంటున్న అడివి శేష్

Highlights

*హిట్ సిరీస్ ఒక యూనివర్స్ అంటున్న అడివి శేష్

Adivi Sesh: నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన సినిమా "హిట్: ది ఫస్ట్ కేస్". విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా 2020లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా "హిట్: ది సెకండ్ కేస్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా "ఆలీతో సరదాగా" షో కి గెస్ట్ గా విచ్చేసిన అడివి శేష్ ఈ సినిమా గురించి కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. "నాని మరియు మిగతా చిత్ర బృందం కలిసి హిట్ సినిమాని మార్వెల్ వంటి ఒక యూనివర్స్ లాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతి సినిమాలో వేరే వేరే హీరోలు నటిస్తూ ఉంటారు" అని అడవి శేష్ హిట్ 3 కూడా రాబోతోందని హింట్ ఇచ్చారు.

మరోవైపు ప్రస్తుతం తన "మేజర్" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు అడివి శేష్. మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో 15 మిలియన్ వ్యూస్ సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories