కొత్త డైరెక్టర్ తో చేతులు కలపనున్న అడివి శేష్

* కొత్త డైరెక్టర్ తో చేతులు కలపనున్న అడివి శేష్

Rama Rao
Updated on: 30 May 2022 7:30 PM IST
Adivi Sesh Working With New Director After Major Movie| Tollywood News
X

కొత్త డైరెక్టర్ తో చేతులు కలపనున్న అడివి శేష్

Adivi Sesh: "ఎవరు" అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువహీరో అడవి శేష్ మళ్ళీ ఇన్నాళ్ళకు "మేజర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2008 ముంబై అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ స్క్రీనింగ్ మొదలయింది. సినిమా చూసిన కొందరు స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారని సమాచారం.

ఇక తాజాగా ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, "నాకు మేజర్ ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. వినయ్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేశారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వినయ్ ఇప్పుడు గూఢచారి 2 కి దర్శకత్వం వహించనున్నారు. తను చాలా టాలెంటెడ్" అని చెప్పుకొచ్చారు అడివి శేష్. "చాలా మంది సపోర్ట్ తో నేను ఈ స్థాయికి వచ్చాను. అందుకే నా నెక్స్ట్ సినిమాలలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాను" అని అన్నారు అడివి శేష్.

"గూఢచారి", "మేజర్" సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వినయ్ ఇప్పుడు "గూఢచారి 2" తో దర్శకుడిగా మారనున్నారు. జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ పతాకాలపై మహేష్ బాబు నిర్మాతగా "మేజర్" సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story